: విజయనగరం జనమయం.. విశాఖపట్నం జలమయం..
విజయనగరం జన సంద్రమైంది. గంటస్థంభం నుంచి మూడు లాంతర్ల జంక్షన్, మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు ఎటు చూసిన ఇసుకవేస్తే రాలనంత జనం. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా సిరిమాను యాత్ర చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భారీ వర్షం కారణంగా యాత్రకు ఆటంకం కలిగినా భక్తులు భారీగానే వచ్చారు. మరోవైపు, వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ ఉదయం నుంచీ భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు నగరంలో సముద్రాన్ని తలపింపజేస్తోంది.