: ఉల్లి అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకోండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన
దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటడానికి కొందరు కృత్రిమ కొరతను సృష్టించడమే కారణమని కేంద్రం అభిప్రాయపడింది. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, దేశంలో అవసరాలకు తగినన్ని ఉల్లి నిల్వలున్నాయని చెప్పారు. వచ్చే రోజుల్లో ఖరీఫ్ పంట మార్కెట్లోకి వస్తే ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని అన్నారు.