: ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కేంద్రం


త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ట్రస్టు సీఈవో చుక్కా కొండయ్య తెలిపారు. ఇటీవల సంభవించిన ఫైలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్టు తరపున బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని అన్నారు. ప్రభుత్వ అధికారులు వెళ్లలేని ప్రాంతాల్లో కూడా తమ వైద్య బృందాలు సహాయ కార్యక్రమాలు అందించాయని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన మందులను ఉచితంగా అందించామని కొండయ్య చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించామని అన్నారు.

  • Loading...

More Telugu News