: ఇంటిని తాకట్టు నుంచి విడిపించుకున్న కమలహాసన్
'విశ్వరూపం' సినిమా నిర్మాణం సమయంలో తాకట్టు పెట్టిన తన ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నానని ప్రముఖ నటుడు కమలహాసన్ చెన్నయ్ లో తెలిపారు. అయితే, తిరిగి మళ్ళీ ఇంటిని ఓ జాతీయ బ్యాంకులో తాకట్టు పెట్టానని ఆయన చెప్పారు. ఇటీవల విడుదలైన 'విశ్వరూపం' సినిమా మంచి కలెక్షన్లను రాబట్టిందనీ, అయితే ఆ లాభాలు ఇంకా తన వరకూ రాలేదనీ కమల్ చెప్పారు. తన వాటా లాభాలు అందిన వెంటనే ఇంటిని బ్యాంకు నుంచి విడిపించుకుంటానని ఆయన నవ్వుతూ చెప్పారు. ఏమైనా, ఈ చిత్ర నిర్మాణం మాత్రం తనకు అన్ని విధాలా పెద్ద గుణపాఠాన్ని నేర్పిందని కమల్ చెప్పాడు.