: పదిమందికి సాయపడే గుణం పవన్ కల్యాణ్ సొంతం: సోమిరెడ్డి


పదిమందికీ సహాయపడే గుణం పవన్ కల్యాణ్ సొంతమని తాను విన్నానని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. అవినీతిపై పోరాటం టీడీపీ దారి అని, మరి పవన్ దారెటు? అంటూ చమత్కరించారు. విభజనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తానన్న సోనియా హామీ ఏమైందంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. 'అధికారం కోల్పోయే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు మరణశాసనం రాసి వెళతారా? సీమాంధ్ర ప్రజల ఆందోళన కేంద్రానికి పట్టదా..?' అని నిలదీశారు. ఇరు ప్రాంతల ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆయన సూచించారు. సోనియా కరుణాకటాక్షాలతో జగన్ బయటకు వచ్చారని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ పూటకో మాట మాట్లాడుతూ జోకర్ లా తయారయ్యారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News