: మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయమని రాహుల్ ని కోరాం: డీకే అరుణ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని కోరామని రాష్ట్ర మంత్రి డీకే అరుణ చెప్పారు. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ కూ తెలిపామని చెప్పారు. ఢిల్లీలో ఈ రోజు ఆమె దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత తమ ప్రాంత ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని, ఇదే విషయాన్ని తాము దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక తెలంగాణలో నిర్వహిస్తున్న జైత్రయాత్ర సభల గురించి కూడా వివరించినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News