: లాలూ, జగదీష్ శర్మలపై అనర్హత వేటు.. నోటీసులు జారీ


దాణా కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ ఎంపీ జగదీష్ శర్మలపై వేటు పడింది. లోక్ సభ ఎంపీలుగా వీరిద్దరూ అనర్హులంటూ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ వేటు వేశారు. ఈ మేరకు అనర్హత నోటీసులు జారీ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ పై నిన్ననే వేటు పడింది. ఈ క్రమంలో రాజ్యసభ జనరల్ సెక్రటరీ కె షరీఫ్.. మసూద్ కు నోటీసులు పంపారు. సుప్రీంకోర్టు తీర్పుతో అనర్హతకు గురైన తొలి లోక్ సభ సభ్యుడు లాలూ కాగా, అలాగే ఈ వేటు పడిన మొదటి రాజ్యసభ సభ్యుడు మసూద్ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News