: మరో యాగానికి గులాబీ దళపతి సన్నద్ధం
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి చండీయాగం నిర్వహించనున్నట్లు సమాచారం. సంకల్పం నెరవేరేందుకు 'అయత చండీయాగం' తలపెట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ గతంలోనూ పలుమార్లు విజయం కోసం చండీయాగం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని తన ఫామ్‌హౌస్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 12 రోజులపాటు యాగం నిర్వహించాలని యోచిస్తున్నారు. 'అయత చండీయాగం' సాధారణ చండీయాగానికి మించి ఫలితాలనిస్తుందని పండితులు చెబుతున్నారు.