: ఈ హెల్మెట్‌తో బోలెడు ప్రయోజనాలున్నాయట!
హెల్మెట్‌తో ఎలాంటి ప్రయోజనాలుంటాయి... దాన్ని తలపై ధరిస్తే ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని కాపాడుతుంది. అలాగే వర్షం వచ్చిన సమయంలో మన తల తడవకుండా మనల్ని రక్షిస్తుంది. అలాకాకుండా మనం ఎటువేపు వెళ్లాలి? అనే విషయాన్ని మనకు చూపిస్తే... అలాగే వాతావరణం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని మనకు తెలియజేస్తే అది సూపర్ హెల్మెట్ అన్నమాట. అలాంటి ఒక కొత్త తరహా హెల్మెట్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు.
సిలికాన్ వాలీలోని ఒక కంపెనీ ఈ కొత్త తరహా హెల్మెట్‌ను తయారుచేసింది. ఈ హెల్మెట్ ఆధునికమైన గాడ్జెట్‌కు అనుగుణంగా రూపొందించబడింది. దీనికి 180 డిగ్రీల కోణంలో తిరిగే ఒక అద్దం కూడా ఉంటుంది. ఇందులో డ్రైవర్ వెనుక వైపు వచ్చే వాహనాలను కూడా చూడవచ్చు. ఎక్కడికి వెళ్లాలో చిత్రం ద్వారా తెలిపే వెసులుబాటు కూడా దీనిలో ఉంది. ఆండ్రాయిడ్, బ్లూటూత్ గల ఈ హెల్మెట్ ద్వారా స్మార్ట్ ఫోన్లకు అనుసంధానం చేసుకోవచ్చు కూడా. చేతులతో సంబంధం లేకుండా మాటల ద్వారానే కాల్ చేసుకోవడం, పాటలు వినడం, ఎస్సెమ్మెస్‌లు పంపడం వంటివి చేయవచ్చు. ఇంటర్నేషనల్ డాటా గ్రూప్ అమెరికాలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో దీనికి ఐదు అవార్డులు దక్కాయి కూడా. మొత్తానికి కొత్త హెల్మెట్ భలేగా ఉందికదూ...!