: ఇలా కూడా సంపాదించవచ్చు!
దొంగతనం, మోసగించడం వంటి కొన్ని పనులను మినహాయించి ఇక ఎలాంటి పనైనా చేసి సంపాదించవచ్చనే విషయం అందరికీ తెలుసు. అయితే ఒక ఆసామి మాత్రం కొత్త విధానంలో సంపాదిస్తున్నాడు. అదేమంటే మానవ తివాచీగా ఉండడం.
తివాచీ అనేది మన కాళ్లకింద ఉంటుంది, మరి మానవ తివాచీ అంటే ఎలా అనుకుంటున్నారా... న్యూయార్క్‌కు చెందిన జార్జియో అనే ఓ 52 ఏళ్ల వ్యక్తి తివాచీలాగా ఎవరైనా తనపైన తొక్కుతుంటే సంతోషిస్తాడట. ఎందుకంటే ఇలా తొక్కించుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టమట. అంతేకాదు ఇలా తొక్కించుకున్నందుకుగాను ఆయన కొంత రుసుము తీసుకుంటారు. గత 15 ఏళ్ళుగా ఆయన మానవ తివాచీగా పనిచేస్తున్నారు. న్యూయార్క్‌లోని ప్రముఖ పబ్బుల్లోను, పార్టీల్లోను మానవ కార్పెట్ అంటే కాస్త ఎక్కువ క్రేజుంది. ఇలాంటి వాటిల్లో ఆయన మానవ తివాచీగా పనిచేస్తారు.
అన్నట్టు ఇలా ఆయన తివాచీగా పనిచేసిన సమయంలో ఆయన్ను తొక్కిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారట. ప్రముఖ పాప్ గాయని గాగా వంటి వారు కూడా ఉన్నారట. అయినా వెర్రి వేయి విధాలు అని ఊరకే అనలేదు. తివాచీలాగా తొక్కించుకోవడం ఎలాంటిదో... అలాగే మానవ తివాచీపై తొక్కాలని అక్కడి జనాలకు ఉండే క్రేజు ఎలాంటిదో.... ఇది వింటేనే మనం అర్ధం చేసుకోవచ్చు!!