: తెలంగాణ ప్రకటనకు నేను బాధ్యుణ్ణి కాను: చిదంబరం


అప్పట్లో తెలంగాణ ప్రకటన వెలువడడానికి చిదంబరమే కారణమని సీనియర్ జర్నలిస్టు ఎంజే అక్బర్ ఓ వ్యాసంలో పేర్కొనడంపై ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం మండిపడ్డారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన వెనుక యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని, అలాంటప్పుడు తననొక్కణ్ణే వేలెత్తిచూపడం తగదని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల దినపత్రికకు లేఖ రాశారు. ప్రధాని, పార్టీ అధినాయకత్వం అనుమతి లేకుండా హోం మంత్రిగా తాను ఎలా నిర్ణయం తీసుకుంటానని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆ వ్యాసంలో అక్బర్.. చిదంబరం తన ప్రకటనతో ఆరిన కుంపటిని రాజేశారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News