: వికాసం జరగలేదు..వినాశనం జరిగింది: విజయ్ గోయల్


ఢిల్లీ రాష్ట్రంలో వికాసం జరగలేదని, వినాశనం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ గోయల్.. షీలాదీక్షిత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ప్రభుత్వాసుపత్రుల్లో గత ఐదేళ్లలో 50 వేల మంది శిశువులు మృతి చెందారని అన్నారు. ఢిల్లీ హైరెస్క్యూ జోన్ కిందకు వస్తుందని సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదిక చెబుతోందని, అలాంటి చోట పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని ఆయన విమర్శించారు. కాగా, ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News