: సీమాంధ్రకు ప్యాకేజి ఇవ్వాలన్న డిమాండుకు మద్దతిస్తాం: కేకే


సీమాంధ్రకు ప్యాకేజి ఇవ్వాలన్న డిమాండ్ కు తాము పూర్తి మద్దతిస్తామని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రకు ప్యాకేజితో పాటు తెలంగాణకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం తుపాను కాదని ఉప్పెన అని, దానిని అడ్డగిస్తే కొట్టుకుపోతారని ముఖ్యమంత్రిపై సెటైరేశారు. ముఖ్యమంత్రి కేబినెట్ నుంచి తెలంగాణ మంత్రులు బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ సభ విషబీజాలు నాటుతుందని అన్నారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానంటున్న ముఖ్యమంత్రి మొదట తెలంగాణలో చేపట్టాలని సూచించారు.

  • Loading...

More Telugu News