: చైనా కొత్త నాయకత్వం కాస్తంత బుర్ర వాడాలి: దలైలామా
చైనా పగ్గాలు స్వీకరించిన కొత్త నాయకత్వం కాస్తంత బుర్ర ఉపయోగించాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు బౌద్ధ మత ప్రధాన గురువు దలైలామా. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన భారీ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనా నూతన అధినాయకగణం వాస్తవాలను గమనించాలని సూచించారు. అధ్యక్షుడు జి జిన్ పింగ్ టిబెట్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తారన్న ఆశాభావం కలుగుతోందని దలైలామా అన్నారు. టిబెటన్లు చైనా నుంచి స్వాతంత్ర్యం కోరుకోవడంలేదని, సహజసిద్ధ స్వయం ప్రతిపత్తి అడుగుతున్నారని దలైలామా పేర్కొన్నారు. హాంకాంగ్, మకావ్ దీవుల మాదిరే టిబెట్ కూ స్వయం ప్రతిపత్తి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.