: తెలంగాణ ఉద్యమం సునామీ లాంటిది: శ్రావణ్
ఫైలిన్ ఓ తుపాను అయితే, తెలంగాణ ఉద్యమం సునామీ లాంటిదని టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అభివర్ణించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిన్న ముఖ్యమంత్రి శ్రీకాకుళంలో చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ సీఎం పదవిని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సీఎం పల్లకి మోసే బోయీలుగా మారారని మండిపడ్డారు.