: మావోయిస్టు శివన్నారాయణను కోర్టులో హాజరు పర్చిన పోలీసులు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పూస శివన్నారాయణను గజ్వేల్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గజ్వేల్ మండలం బెజగామ గ్రామానికి చెందిన శివన్నారాయణ 25 సంవత్సరాల క్రితం మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లారు. బెజగామకు చెందిన వెంకటరెడ్డి హత్యకేసులో శివన్నారాయణ నిందితుడిగా ఉండటంతో ఆయనను నేడు కోర్టులో హాజరు పరిచారు.