: జాన్ కెర్రీని కలిసిన పాక్ ప్రధాని
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన నాలుగు రోజుల అమెరికా పర్యటనలో కాశ్మీర్ సమస్యలో అగ్రరాజ్య జోక్యానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ దేశ కార్యదర్శి జాన్ కెర్రీని కలిశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పాక్ లో భద్రత, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎప్పట్లానే పెద్దన్న కలుగజేసుకుని భారత్ కు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని కోరగా, ఆ కోరికను ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. కాగా ఈ నెల 23న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నవాజ్ షరీఫ్ భేటీ కానున్నారు.