: రచ్చబండతో విభజనకు చెక్?
విభజన తుపానును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. నిన్న శ్రీకాకుళంలో పైలిన్ తుపాను బాధితుల పరామర్శకు వెళ్లిన సమయంలో సీఎం బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తుపానును అడ్డుకోలేకపోయాం గానీ, విభజన తుపానును ఆపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విభజనకు వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడగట్టడంతోపాటు, తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడం ఆయన వ్యూహంగా పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేనా లేక పార్టీ కనుసన్నలలో సాఫీగా విభజన పూర్తయ్యేందుకు సహకారంలో భాగంగానా? అన్న సందేహాలూ ఉన్నాయి.