: బలపడిన అల్పపీడనం.. వర్షసూచన


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 22నాటికి ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

  • Loading...

More Telugu News