: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తాం: సీపీఐ నారాయణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీపీఐ పేద ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. దివంగత సీపీఐ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విగ్రహాన్ని మెదక్ జిల్లా కౌడిపల్లి లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో సీపీఐ ప్రముఖ పాత్ర పోషించనుందన్నారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాయని విమర్శించారు. తెలంగాణ కోసం సూచనలు, సలహాలతో నివేదిక తయారు చేసి ఈ నెలాఖరుకు షిండే కు ఇస్తామని తెలిపారు.