: రష్యా చేరుకున్న ప్రధాని మన్మోహన్
చైనా, రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మన్మోహన్ రష్యా చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయనకు మాస్కోలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాల గురించి మన్మోహన్ చర్చించనున్నారు. అణు ఇంధనం, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన చైనా బయలుదేరి వెళ్తారు.