: ఎంబీఏ విద్యార్థిపై నిర్భయ కేసు నమోదు
అనంతపురం జిల్లా బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ లో ఎంబీఏ విద్యార్థి నాగేశ్వర్ రెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదయింది. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.