: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ 311/1


హైదరాబాద్ టెస్టులో భారత్ దే పైచేయి. తొలి రోజు ఆటలో ఆసీస్ ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ధోనీ సేన తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. రెండో రోజు ఆటముగిసే సరికి టీమిండియా స్కోరు 311/1. 500 పైచిలుకు స్కోరుపై కన్నేసిన భారత్, చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండడంతో రేపు మరింత దూకుడు కనబరుస్తుందనడంలో సందేహం లేదు. సెంచరీల మోత మోగించిన పుజారా (162 బ్యాటింగ్), విజయ్ (129 బ్యాటింగ్) ఇంకా క్రీజులో ఉన్నారు.

ఇప్పటికే ఆసీస్ పై 74 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. ఆ పట్టును మరింత బిగించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో కంగారూ బౌలర్ల కష్టాలు అన్నీఇన్నీకావు.  ఆదివారం తొలి సెషన్ లో కేవలం ఒక్క వికెట్ సాధించిన వారికి రోజంతా వికెట్ల కరవు తప్పలేదు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను 237/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News