: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
కడప పట్టణం సమీపంలోని కనుములోపల్లి వద్ద నిన్న అర్ధరాత్రి లారీ-మినీ వ్యాను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కాగా మృతి చెందిన వారిని కర్నూలు జిల్లా డోన్ కు చెందిన వారుగా గుర్తించారు.