: ఆడవారు ఆనందంగా ఉంటేనే లాభమట


ఎక్కడ ఆడవారు గౌరవించబడతారో అక్కడ దేవతలు కూడా సంతోషంగా ఉంటారని పెద్దవాళ్లు అంటుంటారు. అందుకే ఆడవాళ్ల మనసు కష్టపెట్టకుండా ఉండాలంటారు. ఇది ఉద్యోగం చేసే ఆడవారికి కూడా వర్తిస్తుందట. ఉద్యోగం చేసే ఆడవారు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో సదరు సంస్థ లాభాల బాటలో నడుస్తుందట. తాజాగా నిర్వహించిన అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పురుషుల విషయంలో ఎలావున్నా ఆడవారు ఆనందంగా ఉంటేమాత్రం ఆ సంస్థలు మిగిలిన వాటితో పోల్చుకుంటే అధిక లాభాలను ఆర్జిస్తాయని అధ్యయనాల్లో తేలిందట.

సంస్థల్లో పనిచేసే ఆడవారికి మంచి జీతం, అనువైన పనివేళలు, విధుల్లో సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఇలా వారికి అనుకూలంగా ఉండే సమయం, వేతనం ఇలా అన్ని విషయాల్లోను వారికి ఆనందాన్ని కలిగిస్తే ఆ సంస్థ మిగిలిన వాటికన్నా ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంటుందట. అమెరికాకు చెందిన ఉద్యోగ నియామక సలహాదారులు ఈ విషయాన్ని చెబుతున్నారు. అదికూడా ప్రపంచవ్యాప్తంగా ఏడువందల సంస్థల పనితీరు, లక్షల మంది ఉద్యోగినుల పనితీరు గమనించాక వాళ్లు ఈ వివరాలను వెల్లడించారు. అంటే ఏదైనా ఒక సంస్థ చక్కగా రాణించాలంటే ఉద్యోగుల్లో మూడు ప్రధాన గుణాలు ఉండాలని వీరంటారు. వాటినే '3ఇ'గా చెబుతారు. వాటిలో మొదటి 'ఇ' ఎంగేజ్‌మెంట్‌కు సంకేతం. అంటే పనిచేస్తున్న సంస్థతో ఉద్యోగినికి ఉన్న అనుబంధం అన్నమాట. ఇక రెండో 'ఇ' ఎనేబుల్డ్‌ అనే పదానికి సంక్షిప్త రూపం. ఉద్యోగినుల సామర్ధ్యం, నిర్మాణాత్మకతను ఇది సూచిస్తుంది. ఇక మూడోది ఎనర్జయిజ్డ్‌. అంటే సంక్షేమం, ఉత్తేజం అని. ఈ మూడవది ఉంటే మొదటి రెండూ సాధ్యమవుతాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News