: వైఎస్సార్ సీపీతో సీపీఎం సర్దుబాటు బహిరంగ రహస్యమే: నారాయణ
వైఎస్సార్ సీపీతో సీపీఎం పార్టీకి రాజకీయ సర్దుబాటు బహిరంగ రహస్యమేనని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తన ఆరోపణలకు రాఘవులు డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చారని మండిపడ్డారు. సీపీఎం, సీపీఐ మధ్య రాజకీయ ఆరోపణల్లో నిజానిజాలు భవిష్యత్తులో తేలుతాయని ఆయన స్పష్టం చేశారు.