: విజయ్ సెంచరీ.. భారత్ 240/1


హైదరాబాద్ టెస్టులో భారత ఆటగాళ్లు శతకాలతో మోత మోగిస్తున్నారు. కొద్ది సేపటి కిందట పుజారా కెరీర్ లో నాలుగో శతకాన్ని పూర్తిచేసుకోగా, స్పిన్నర్ డోహెర్టీ బౌలింగ్ లో రెండు వరుస ఫోర్లు బాది ఓపెనర్ విజయ్ (245 బంతుల్లో 103 బ్యాటింగ్) కూడా సెంచరీ అధిగమించాడు.

అయితే, శతకం పూర్తి చేసుకోవడానికి భారీగానే బంతులు ఎదుర్కొన్నా.. భారీ స్కోరు దిశగా ఉరకలేస్తున్న భారత్ కు పటిష్టమైన పునాది వేయడంలో సఫలుడయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 240/1 కాగా.. ఆసీస్ పై 3 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కంగారూలు తమ తొలి ఇన్నింగ్స్ ను 237/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News