: సీపీఎం, సీపీఐ మధ్య లేఖల యుద్ధం


సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బహిరంగ లేఖ రాశారు. రెండు రోజుల కిందట రాఘవులు తనకు రాసిన లేఖకు ఇందులో నారాయణ ఘాటుగా సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీతో సీపీఎం రాజకీయ సర్దుబాట్లు బహిరంగ రహస్యమేనన్నారు. రాఘవులు దిగజారుడు రాజకీయం ముందు తానెంత అని వ్యాఖ్యానించారు. వైసీపీ పొత్తు అంశంలో రాఘవులు వ్యతిరేకించారని లేఖలో పేర్కొన్న నారాయణ, తన ఆరోపణలకు రాఘవులు డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారన్నారు. సీపీఎం, సీపీఐ మధ్య రాజకీయ ఆరోపణల్లో నిజానిజాలు ఎంతన్నది భవిష్యత్తులో తేలుతాయన్నారు.

  • Loading...

More Telugu News