: పుజారా సెంచరీ.. చేరువలో విజయ్


భారత యువ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా హైదరాబాద్ టెస్టులో శతకం పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ సెహ్వాగ్ అవుటవడంతో బరిలో దిగిన పుజరా 188 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పుజారా మరో ఓపెనర్ విజయ్  తో కలిసి రెండో వికెట్ కు 196 పరుగులు అజేయ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. మరోవైపు, ఆసీస్ ను ముప్పుతిప్పలు పెడుతున్న విజయ్ సెంచరీకి చేరువలో నిలిచాడు. విజయ్ ప్రస్తుతం 94 పరుగులతో ఆడుతున్నాడు. దీంతో భారత్ వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News