: సచిన్ ను మించిన బ్యాట్స్ మన్ ను నేను చూడలేదు : క్లార్క్


సచిన్ ను ఆకాశానికెత్తేస్తున్న వారి లిస్టు అంతకంతకూ పెరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా ఈ జాబితాలో చేరాడు. సచిన్ ను మించిన ఆటగాడితో తాను ఆడలేదని... కనీసం చూడలేదని కొనియాడాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో బ్రాడ్ మన్ తర్వాతి స్థానం టెండూల్కర్ దే నని సచిన్ పట్ల క్లార్క్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సచిన్ ఎంత గొప్ప ఆటగాడైనా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందేనని... కానీ అతని నిర్ణయం కోట్లాది అభిమానులను ఎంతగానో బాధించుంటుందని అన్నాడు. క్రికెట్ ఆల్ టైం గ్రేట్స్ గురించి క్లార్క్ మాట్లడేటప్పుడు రికీపాంటింగ్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం!

  • Loading...

More Telugu News