: అది కాంగ్రెస్ అంతిమ యాత్ర సభ: టీడీపీ ఎమ్మెల్సీలు


నిజామాబాద్ జిల్లా బోధన్ లో శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించినది జైత్రయాత్ర సభ కాదని, అంతిమయాత్ర సభ అని టీడీపీ ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, గంగాధర్ గౌడ్ లు విమర్శించారు. హైదరాబాద్ లో వారు మాట్లాడుతూ, టీడీపీ జెండా దిమ్మెల గురించి మాట్లాడే దమ్ము ఆ పార్టీ నేతలకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కనీసం కన్నెత్తి చూడని నేతలంతా జైత్రయాత్ర సభలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. వెయ్యి మంది ఆత్మబలిదానాలకు కారణం కూడా నేతలేనన్న విషయం ప్రజలకు తెలుసని వారు హితవు పలికారు. తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆరాటపడే వారు, పదవులకోసం పాకులాడే వారే ఈ సభను నిర్వహించారని వారు విమర్శించారు.

  • Loading...

More Telugu News