: సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందా?: శేఖర్ కపూర్


సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందా? అంటూ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో ఈ సినీ దర్శకుడు ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 'మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది సిక్కుల్ని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు నరికి చంపారు. ఈ దారుణానికి వేలాది మంది సిక్కులు అనాధలుగా, వితంతువులు మారారు. అయితే ఈ దారుణానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందా?' అని శేఖర్ కపూర్ సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపిస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News