: కొనసాగుతున్న పసిడి వేట


ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా దాండియా ఖేరా గ్రామంలో పసిడి వేట ఈ రోజు కూడా కొనసాగుతోంది. రాజా రాంభక్ష్ సింగ్ కోట అంతర్భాగంలో 1000 టన్నుల బంగారం ఉందని ఒక సాధువుకి కల రావడంతో భారత పురావస్తు సర్వే విభాగం నిన్న తవ్వకాలు ప్రారంభించింది. అవి ఈ రోజూ కొనసాగుతున్నాయి. వేలాది మందిగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకోవడంతో దాండియా ఖేరా గ్రామం తిరునాళ్ల సందడిని తలపిస్తోంది. దీంతో కోట పరిసరాల్లోకి ఇతరులు ప్రవేశించకుండా అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం ఉన్నదీ, లేనిదీ తేలడానికి నెల రోజుల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News