: ప్రధాని శ్రీలంక పర్యటనపై అయోమయం
వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి ప్రధాని మన్మోహన్ హాజరవుతారా? లేదా? అనే విషయంలో అయోమయం నెలకొంది. విదేశాంగ విధానం, అంతర్జాతీయ బాధ్యతలు, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ తెలిపారు. సదస్సు జరగడానికి ముందు నిర్ణయం వెలువడుతుందని ఆమె తెలిపారు. ఎల్టీటీఈని అంతమొందించే క్రమంలో శ్రీలంకలో తమిళుల ఊచకోత జరిగింది. దీనిని నిరసిస్తూ తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు మన్మోహన్ శ్రీలంక పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం శ్రీలంక పర్యటనపై ఊగిసలాట ధోరణిని అవలంబిస్తోంది.