: పార్లమెంటులో బిల్లు పెట్టడం అంత సులభం కాదు: లగడపాటి


పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడం అంత సులభం కాదని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. వైజాగ్ లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగాల కారణంగా రాజీనామాలు చేశామనే కారణంతో స్పీకర్ తమ రాజీనామాలను తిరస్కరించారని అన్నారు. ఆర్టికల్ 371-డి అమల్లో ఉన్నందున రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన తెలిపారు. జగన్ ను దత్తత తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తమని దూరం చేసుకుంటోందని లగడపాటి అభిప్రాయపడ్డారు. తన రాజీనామా ఆమోదం పొందాక రాష్ట్ర విభజనకు కారణమైన వారి జాతకాలు బయటపెడతానని లగడపాటి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News