: ఎఫ్ఐఆర్ కు నేను భయపడను: కుమారమంగళం బిర్లా
'నేనేం తప్పు చేయలేదు... అందుకే సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించి భయపడడం లేదు' అని కుమారమంగళం బిర్లా తెలిపారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆర్థికమంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. చిదంబరంతో తాను అనేక విషయాల గురించి చర్చించానని బిర్లా అన్నారు. ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడటానికి ఏమీ లేదని... జీవితం కొనసాగుతూనే ఉంటుందని... తాను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని చెప్పారు.
సీబీఐ చర్యతో పారిశ్రామిక వర్గాల్లో అలజడి చెలరేగడంతో... కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. బొగ్గు కుంభకోణంలో కుమారమంగళం బిర్లాను నిందితుడిగా చేర్చడం వల్ల... విదేశీ పెట్టుబడుల రాకకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపాలంటూ ప్రధాని మన్మోహన్.. ఆర్థిక మంత్రి చిదంబరం, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మకు సూచించినట్టు తెలుస్తోంది.