: నల్లధనాన్ని వెలికితీస్తే, బంగారాన్ని అన్వేషించాల్సిన అవసరం లేదు: మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తిని కోరుకుంటున్నారని... తమిళ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని అన్నారు. మొన్న సంభవించిన ఫైలిన్ తుపాను ధాటికి తూర్పు రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతాయని అందరూ ఊహించారని... కానీ, అనుకున్నంతగా ఏమీ కాలేదని... ఎందుకంటే ఫైలిన్ కంటే మార్పు అనే పెద్ద తుపాను దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతోందని మోడీ తెలిపారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొస్తే, బంగారం కోసం అన్వేషించాల్సిన అగత్యం ఉండదని అన్నారు. ఈ రోజు సాయంత్రం మద్రాస్ యూనివర్సిటీలో మోడీ కీలకోపన్యాసం చేయనున్నారు.

  • Loading...

More Telugu News