: బస్ స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీటిని ఈడీ కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) తోపాటు మొత్తం 9 బస్ స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంజీబీఎస్ లో మెటల్ డిటెక్టర్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే, భద్రత కోసం ప్రత్యేకంగా 89 మంది సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.