: బెజవాడలో టీడీపీ వినూత్న నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో సెలూన్ షాప్ నిర్వహించారు. విభజన అనంతరం సీమాంధ్రకు జరిగేది క్షవరమే అంటూ సింబాలిక్ గా టీడీపీ నేతలు దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ రావు, కేశినేని నాని తదితరులు పలువురికి క్షవరం చేశారు. విభజనను అడ్డుకునేంతవరకు టీడీపీ పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు.