: సచిన్ కు డబ్బావాలాల వందనం
200వ టెస్టుతో క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న సచిన్ టెండూల్కర్ కు ముంబై డబ్బావాలాలు శాల్యూట్ చేయనున్నారు. ముంబైకు చిహ్నంగా నిలిచిన సచిన్ భారతీయులందరూ గర్వపడేలా చేశారని, కనుక సచిన్ రిటైర్మెంట్ సమయంలో స్టేడియంలో ఉండడం తమ బాధ్యతగా టిఫిన్ బాక్స్ సప్లయర్స్ ట్రస్ట్ కు చెందిన సుభాష్ తాలేకర్ చెప్పారు. సచిన్ 200వ టెస్ట్ కోసం 100 మంది వరకు డబ్బావాలాలు సెలవు పెట్టి మరీ వాంఖడే స్టేడియంలో వాలిపోనున్నారు.