: ఇండియా, పాక్ విభజన నేపథ్యంలో అమీర్ ఖాన్ హీరోగా మణిరత్నం సినిమా


వివాదాస్పద కథాంశాలను తెరకెక్కించే తమిళ దర్శకుడు మణిరత్నం, ఈసారి మరో వివాదాస్పద అంశాన్ని తన సినిమాకి ఎంచుకుంటున్నాడు. 1947లో ఇండియా నుంచి పాకిస్తాన్ విభజన జరిగిన సందర్భంలో... రెండు ప్రాంతాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యాన్ని తన కొత్త సినిమాకు కథా వస్తువుగా మణిరత్నం తీసుకుంటున్నాడు. ఈ బ్యాక్ డ్రాప్ లో హిందూ, ముస్లిం జంట మద్య నడిచే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుందట.

దీనిని హిందీలో నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తారని సమాచారం. ఓ పట్టాన కథలను ఓకే చేయని అమీర్ ... మణి చెప్పిన ఈ స్టోరీని అక్కడికక్కడే ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు పని జరుగుతోంది. కాగా, మణిరత్నం ఇటీవల తీసిన 'కడలి' సినిమా దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే! 

  • Loading...

More Telugu News