: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం


ఛాద్, చిలీ, లిథువేనియా, నైజీరియా, సౌదీ అరేబియా దేశాలకు ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభించింది. నిన్న జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఐదు దేశాలు 2014 జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా వ్యవహరిస్తాయి. 193 సభ్యదేశాలు పాల్గొన్న ఓటింగ్ లో ఈ ఐదు దేశాలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఎన్నికయ్యాయి. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కొత్త సభ్య దేశాల రాకతో పాత దేశాలైన అజర్ బైజాన్, గ్వాటిమాలా, మొరాకో, పాకిస్థాన్, టోగో దేశాలు తప్పుకోబోతున్నాయి. వీటి కాలపరిమితి ఈ ఏడాది చివరి నాటికి ముగియనుంది. 2011, 2012 సంవత్సరాల్లో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ వ్యవహరించింది.

  • Loading...

More Telugu News