: అయోధ్యలో తీవ్ర ఉద్రిక్తత


ఈ రోజు అయోధ్యలో విశ్వ హిందూ పరిషత్ 'సంకల్ప సభను' నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభను అడ్డుకునేందుకు అఖిలేశ్ సింగ్ యాదవ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అయోధ్య పరిసర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను విధించింది. వీహెచ్ పీ కార్యకర్తలను అడ్డుకోవడానికి దాదాపు 2 వేల మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లు అయోధ్య పరిసర ప్రాంతాల్లో మోహరించారు. వీరికి తోడు భారీ సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు.

ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వందల మంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 42 మంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. వీరిలో రామ మందిర ఉద్యమ నాయకులు మహంత్ గోపాల్ దాస్, మహంత్ సురేష్ దాస్, బ్రిజ్ మోహన్ దాస్, అభిషేక్ మిశ్రాలాంటి నేతలున్నారు. వీహెచ్ పీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అయోధ్య వైపు వెళ్లరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం తమ సభను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము వెనక్కు తగ్గబోమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి అయోధ్యలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News