: ఇలా చేసి చూడండి...
ఒక్కోసారి మనకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రోజులో ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి కచ్చితంగా ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని చిన్న చిన్న మార్పులను చేసుకుంటే చక్కగా ఒత్తిడిని జయించి ఉల్లాసంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవారు ఇటు ఇంట్లోను, అటు బయట ఉద్యోగం చేస్తూ రెండు వైపులా కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో మన రోజువారీ జీవితంలో చిన్న మార్పులను చేసుకుంటే చక్కగా ఆనందంగా ఉండవచ్చట.
నెలలో ఒక్కరోజైనా మీకు ఇష్టమైన సినిమా చూడండి, అలాగే ఫేస్‌బుక్ వంటివాటిలో మీకూ అకౌంట్ ఉంటే అందులో మీ స్నేహితులతో ఆన్‌లైన్‌లో సంభాషించండి. మీ పిల్లలతో ఎక్కడికైనా సరదాగా వెళ్లిరండి. అలాగే ధ్యానం చేసే అలవాటు ఉన్నవారు ధ్యానం చేయండి. లేనివారు చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉండడంతోబాటు ధ్యానం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అలాగే మీకు ఇష్టమైన వంటకాలను చేసుకుని చక్కగా మీరు తినడంతోబాటు ఇంట్లో వారికి కూడా రుచి చూపించండి.
రోజూలాగా కాకుండా కాస్త ప్రత్యేకంగా తయారై చూడండి. మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. పైగా బాగున్నావంటూ మెచ్చుకుంటారు. మనం ఆనందంగా ఉండడానికి ఈ మెచ్చుకోళ్లు టానిక్‌లాగా పనిచేస్తాయి. అలాగే రోజూ కొద్దిసేపు మీకు ఇష్టమైన పాటలను పెట్టుకుని వింటూ సంగీతాన్ని ఆస్వాదించండి. ఇలా కొన్ని చిన్న చిన్న పనులను చేయడం వల్ల మీకు రోజువారీ జీవితంలోని విసుగు లేకుండా చక్కగా ఒత్తిడిని కూడా జయించి రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు వీలవుతుంది.