: వంటింటినుండే అందాన్ని కాపాడుకుందాం


సహజంగా ఉండే మన ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మన వంటింట్లో ఉండే దినుసులే మన అందాన్ని మెరుగులు దిద్దడానికి తోడ్పడతాయి. చర్మంపై ఎక్కువగా కనిపించే సమస్య మృతకణాలు. ఇవి పేరుకుంటే చూడడానికి ముఖం కాస్త జిడ్డుగా, మురికిపట్టినట్టుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖానికి చక్కటి ఫేషియల్‌ చేయించుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. కానీ ఇలాంటి ఫేషియల్‌ను వేసుకోవడానికి బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ప్రయత్నించండి.

వంటసోడాలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రుద్దిచూడండి. కొద్దిసేపటికి చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఆలివ్‌ ఆయిల్‌ను ముఖంపై రుద్దిచూడండి. దీనివల్ల కూడా మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. అలాగే ఆలివ్‌ ఆయిల్‌లో కొద్దిగా కాఫీ గింజల పొడి వేసి దాన్ని ముఖంపై రుద్దినా కూడా మృతకణాలు తొలగిపోతాయి. అలాగే బొప్పాయి, అరటిపండు గుజ్జు రుద్దినా, లేదా కొద్దిగా తేనె, పెరుగు కలిపి రుద్దినా ముఖంపైని మృతకణాలు తొలగిపోయిన చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. ఇంకా వయసు ఛాయలు ముఖంపై కనిపించకుండా ఉంటుంది.

  • Loading...

More Telugu News