: అందరూ అభిమన్యులేనట!


కడుపులో ఉండే ప్రతి బిడ్డా అభిమన్యుడి వంటివారేనట. ఎందుకంటే, కడుపులో ఉండగానే అన్ని విషయాలను వింటూ ఉంటారట. తాజాగా నిర్వహించిన అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బిడ్డలు అమ్మ కడుపులో ఉండగానే అభ్యసనాన్ని ప్రారంభిస్తారని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

తల్లి గర్భంలో ఉండగా శిశువు శరీరంతోబాటు మెదడు కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో అనేకరకాలైన శబ్దాలను శిశువు వినడంతోబాటు గుర్తుపెట్టుకుంటుంది కూడా. కడుపులో ఉండే బిడ్డకి వాసనలను గ్రహించే శక్తి, స్పర్శాజ్ఞానం కూడా ఉంటాయట. వీటితోబాటు శబ్దాన్ని గుర్తుపెట్టుకునే శక్తి కూడా శిశువుకు ఎక్కువగా ఉంటుందని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అందుకే చిన్న లాలిపాటను పాడినా కూడా శిశువుకు ఎంతో హాయి కలుగుతుందని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News