: ఐఐటీ మద్రాస్ బోర్డులో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ ఐఐటీ మద్రాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చేరబోతున్నారు. క్రిస్ గోపాలకృష్ణన్ లాంటి ప్రముఖ వ్యక్తి తమ బోర్డులోనికి రావడం ఎంతో గర్వకారణమని, తాము ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కరమూర్తి తెలిపారు. ఐఐటీ మద్రాస్ లో పూర్వ విద్యార్థిగా తనకు ఇది అపూర్వమైన అవకాశమని క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం మన విద్య, పరిశోధన ప్రమాణాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా తాను కృషి చేస్తానని క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు.