: సమైక్యాంధ్ర నయవంచకుడు సీఎం కిరణ్: వాసిరెడ్డి పద్మ
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర నయవంచకుడు అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, సీఎం కిరణ్ ఆరు కోట్ల సీమాంధ్రులను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీకి ఆయన కోవర్టని అన్నారు. ఉద్యోగులతో విభజించు పాలించు పద్ధతిలో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. సీఎంను చరిత్ర క్షమించదని ఆమె ఆభిప్రాయపడ్డారు. ఎంత కష్టమొచ్చినా జగన్ రాష్ట్రాన్ని కాపాడతారని ఆమె తెలిపారు.