: తెలుగు వారియర్స్ కు నేటి మ్యాచ్ కీలకం!


సెలబ్రిటీల మధ్య నేడు రసవత్తరమైన క్రికెట్ సమరం జరగనుంది. పుణె నగరంలో నాలుగు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. గత మ్యాచులో కర్ణాటక జట్టు చేతిలో ఓటమి పాలైన తెలుగు వారియర్స్ నేడు భోజ్ పురి జట్టుతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. తెలుగు వారియర్స్ కు ఇది కీలకమైన మ్యాచ్. తెలుగు వారియర్స్ - భోజ్ పురి జట్ల మధ్య మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. జీ తెలుగు దీనిని ప్రసారం చేయనుంది. 

మరోవైపు వీర్ మరాఠి, ముంబై హీరోస్ జట్ల మధ్య పుణెలోనే సాయంత్రం 7 గంటల నుంచి మరో పోటీ మొదలవుతుంది. దీనిని స్టార్ గోల్డ్ చానల్ ప్రసారం చేస్తుంది. నేటి సమరం తర్వాత ఫైనల్ కు వెళ్లే జట్లు ఏవో తేలిపోనున్నాయి.

రెండు సెమీ ఫైనల్ మ్యాచులు ఈ నెల 9న హైదరాబాద్ లో జరుగుతాయి. అంతిమ సమరం 10న బెంగళూరులో ఉంటుంది. 

  • Loading...

More Telugu News