: పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు


సహజంగా పోలీసులకు ఎదురు మాట్లాడేందుకు ఎవరూ సాహసించరు. కానీ, ఈ గ్రామస్తులు పోలీసులపైనే దాడి చేశారు. వివరాల్లోకెళితే.. బీహార్లోని సీతామర్హి జిల్లాలో అశోగి గ్రామంలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడంటూ గ్రామస్తుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారు. దీంతో, గ్రామస్తులు ఒక్కసారిగా పోలీసులపై రాళ్ళతో దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్సైతోపాటు ఆరుగురు కానిస్టేబుళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను స్థానిక ఆసుపత్రికి తరలించామని, ఘటనకు కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News